దక్షిణ కాశిగా పిలవబడే ఈ ప్రాంతం కృష్ణానది ఒడ్డున కొలువై ఉంది . అతి ప్రాచీనమైన దేవాలయం ఇది.
అందమైన కృష్ణానది ప్రవాహం , గల గల పారే కృష్ణమ్మా ఒడ్డున, డివిసీమ లో వెలసిన మహిమన్మితమైన శైవ క్షేత్రం ముక్తేశ్వర స్వామి దేవాలయం . ఈ దేవాలయం లో ఉన్న స్వామి వారు గంగ పార్వతి సమేతంగా కొలువై ఉన్నారు . ఇక్కడ ఉన్న విగ్రహం ఎంతో విశిష్టమైనది మరియు శక్తి వంతమైనది అని చెబుతారు .