శ్రీశైల క్షేత్రం మహత్తరమైన యోగ భూమి, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో శ్రీశైల క్షేత్రానికి గల విశేషాలు కోకొల్లలు ఈ క్షేత్రం అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం రెండవ క్షేత్రం మరియు అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవది అఖండ భూమండలంలో ఆధ్యాత్మిక సంపద గల భరత ఖండంలో శ్రీశైలం భూకైలాసం శ్రీశైలంలోని శివలింగ దర్శనం జన్మరాహిత్యాన్ని కలిగించి ముక్తిని ప్రసాదించే మహత్తర జ్యోతిర్లింగం ఋషులకు యోగులకు సిద్ధులకు ఔషధాలకు నిలయమైన అనంత విశేషాలు కలిగి ఉన్న అద్భుతమైన పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీశైలం ఈ భూమండలానికి నాభిస్థానం
జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు వారు ఇచ్చట తపస్సు అనుసరించుట చే ఈ క్షేత్రమునకు ఒక ప్రత్యేకత విశిష్టత ఏర్పడినది కృష్ణా నది తీరమున ప్రకృతి రమణీయమైన పర్యావరణ అరణ్య మధ్య ప్రదేశమున నెలకొని ఉన్న ఈ మహా క్షేత్రం దినదినాభివృద్ధి గావించు చున్నది యాత్రికుల సంఖ్య మిక్కుటంగా పెరుగుచున్నది అట్టి యాత్రికులకు ఉచిత భోజన వసతి కల్పించడం ఈశ్వర ఆరాధనలో భాగంగా పరిగణింపబడుచున్నది ఇచ్చట చేయు అన్నదానము ఈ హా పరలోక సాధనము విశేష ఫలదాయకం
ప్రయోగాలు లక్షమందికి , కాశీలో రెండు లక్షల మందికి పవిత్ర గంగానది ఒడ్డున ఏడు లక్షల మందికి అన్నదానం చేస్తే ఎంత పుణ్యమో ఈ శ్రీశైల క్షేత్రములో ఒక్కరికీ అన్నదానం చేస్తే అంతటి పుణ్యాన్ని కలిగిస్తుంది అని పురాణాలు సూచిస్తున్నాయి
శ్రీశైల క్షేత్రం సముద్ర మట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తులో కలదు ఇక్కడ నుండి కాశీకి సొరంగమార్గం ఉన్నట్లు ప్రసిద్ధి కాశీ పుణ్య క్షేత్రంలో మరణం అరుణాచలంలో భగవన్నామ స్మరణం శ్రీశైలం దర్శనం ముక్తి ప్రదాయకం శ్రీశైలంలో అనంత కోటి లింగం లు కలవు దేవతలు అవతార పురుషులు హిరణ్యకశిపుడు శ్రీరామచంద్రుడు పాండవులు దర్శించి పూజలు చేసి ఆలయాలు నిర్మించి నట్లు.
[7:42 pm, 05/02/2022] HM Vivaha Parichaya Vedik: ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఆచార్య నాగార్జునుడు శ్రీకృష్ణదేవరాయలు మరియు చత్రపతి శివాజీ వంటి ప్రముఖులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న శాసనాలు తెలియజేస్తున్నాయి
ఈ పుణ్య క్షేత్రం నందు అన్ని కులముల వారు వారి వారి స్తోమతను బట్టి అన్నదాన సత్రంలో నిర్మించుకొని స్వామి అమ్మవార్ల దర్శనం కొరకు వచ్చే వారికి భోజన వసతి సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి అదే విధంగా అత్యధిక జనాభా గల మాల కులస్తులకు అంటే మనకు ఇంతవరకు వసతులు గల సత్రము లేదు కనుక మాల కులస్తులు అందరూ వారివారి స్తోమతను బట్టి ఆర్థిక సహాయం చేస్తూ క్షేత్రానికి వచ్చే భక్తులకు సేవ చేయుట మనందరి బాధ్యతగా భావించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున హిందూ మా అన్న సత్రం మన హిందూ మాలలకు గాను శ్రీశైల దేవస్థానం వారు మొదట రెండు ఎకరాల స్థలంలో కేటాయించడం జరిగింది కానీ మన దగ్గర సత్రం నిర్మించుకునేందుకు స్తోమత లేక స్థలం అలాగే ఉండిపోయింది ఈ విషయాన్ని గమనించిన దేవస్థానం వారు ఆ స్థలాన్ని నోటీసులు పంపి స్వాధీనం చేసుకోవడం జరిగింది నూతనంగా ఎన్నికైన కమిటీ మరోసారి దరఖాస్తు చేసుకోగా 50 సెంట్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఒక దాత ద్వారా ధనమును అప్పుగా తెచ్చి పది గదులను నిర్మిం చడం జరిగింది ఆ తర్వాత మన హిందూ మహా దాతలు ముందుకు వచ్చి కొన్ని గదులు నిర్మించడం జరుగుతున్నది ఇప్పటికైనా మన హిందూ మహిళలు ముందుకు వచ్చి సగర్వంగా నిర్మించుకుందాం చరిత్రలో చేతకాని వారిగా నిలిచిపోతారు ఇది మాలలు గమనించగలరు
[7:43 pm, 05/02/2022] HM Vivaha Parichaya Vedik: సత్రం నందు గది నిర్మించుకున్న దాతలకు ప్రత్యేకత:-- సత్రం నందు రెండు రకాల గదులు నిర్మించుకునేందుకు దాతలు లకు అవకాశం కల్పించ బడుతుంది ఇందులో ఒకటి డీలక్స్ గది రెండవది సూట్ రూమ్ ఈ విధంగా రకాల గదులు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించబడుతుంది ఈ గదులు నిర్మించుకునేందుకు ఆయా సందర్భాల బట్టి రేట్లు నిర్ణయించడం జరుగుతుంది ఈ విధంగా గదులు నిర్మించుకున్న వారికి సంవత్సరంలో 30 రోజులు ఉచితంగా వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుంది మిగిలిన రోజులలో కేవలం మెయింటెనెన్స్ ఛార్జీలతో ఈ క్షేత్రాన్ని సందర్శించే యాత్రికులకు వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుంది
అన్నదానానికి ఇచ్చే విరాళమిచ్చు దాతలకు ప్రత్యేక త :-- సత్రం నందు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చే దాతలకు వారు వారు స్తోమతను బట్టి వారు అన్నదానానికి విరాళాలు ఇచ్చుకోవచ్చు విరాళాలు ఇచ్చిన వారు సూచించిన మేరకు ఆయా తేదీలలో వారి వారి పేర్ల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ స్వామి అమ్మవార్లకు వారు సూచించిన పేర్ల మీద ప్రత్యేక పూజలు నిర్వహించబడును అంతేగాక వారు సూచించిన తేదీని నోటీస్ బోర్డ్ పై లిఖించబడిన అదే రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును