ఆధ్యాత్మిక సంబంధములగు తాత్విక విషయములపై జిజ్ఞాస కలిగియున్న భక్తులకు తెలియజేయు విషయము.
తాత్విక సంబంధమగు అనేక గ్రంధములలో సుప్రసిద్ధములైన భగవద్గీత, ఉత్తరగీత, ఉపనిషత్తులు, ఉపదేశసారము, విజ్ఞాననౌక, నిర్వాణశతకము, వేమన పద్యములు, భాగవతము మొదలగు అనేక గ్రంధములలో ఉన్న అంశములను సరళముగా చేసి గురుసమక్షమున కూర్చోని వింటున్నామన్న భావన కలిగే విధముగా అందించడము జరిగినది.
ఈ విషయములను అందరు విని కృతార్ధులు అగు విధముగా పూజ్యశ్రీ శ్రీమద్ గురుదేవులైన బ్రహ్మశ్రీ శ్రీరామచైతన్య స్వాములవారు మంచిగా, సులభముగ అర్థము అగురీతిగా అందచడము జరిగినది. ఈ ప్రవచనములను విని దైవకృపకు పార్థులు అగుదురని భావిస్తున్నాము.
ఈ తాత్విక ప్రవచన సంబంధమైన ఈ యాప్ ను మీకు తెలిసినవారికి పంపించగలరు.
హరిః ఓం తత్సత్ !