అందరికి నమస్కారం
శ్రీ షిరిడీ సాయి కృపతో మా తంద్రిగారైన స్వర్గీయులు గొర్తి సూర్యనారాయణ శర్మ గారు బాబా జీవిత సత్చరిత్రను పద్య రూపమున రచించిరి. ఈ పద్యాలు బాబా భక్తులందరికి చెరాలని వారి కొరిక. అందున ఈ పద్యాలను వారు సులభమైన పదాలతో అందరికీ అర్ధమైయ్యేలా రచించారు.
ఈ పద్యములతొ సాయి భక్తులు బాబా జివిత సచ్చరిత్ర పారాయణ మరియు భజనలు చెసి తరించాలని, శ్రీ షిరిడీ సాయి కృపతో మా తండ్రిగారు రచించిన ఈ సత్చరిత్రను భక్తులకు ఈ APP ద్వారా అందజేయ మా ఈ ప్రయత్నం.
శుక్లామ్బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాన్తయే
||సీ.|| రచయిత ఎవ్వడు? రచయించుటెయ్యది?
రచన ఏది? తలల రాత రచన
నలువచేయగలేద? విలువకట్ట తరమె
కావ్యరచనజేయు కవులమనసు
సాయిదీవెనలంది సంతోషమున నేను
పద్యరచన చేయనుద్యమించి
సీసపద్య రచన రసవత్తవరంబుగా
సాగుచుండ మనస్సు శాంతి బొంది
||తే.గీ.|| సాయి జీవిత చరిత మాసాంతముగను
రాగరంజిత మగునట్లనుగ్రహించి
సూర్యనారాయణు వినతి కరుణ గనవె
సకల సద్గుణధామ శ్రీ సాయిరామ ||౧||