అందరికి నమస్కారం
ఈ ఆండ్రోయిడ్ అప్లికేషన్ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో రూపొందించబడింది. గత 3 నెలలు గా ఈ అప్లికేషన్ ను పవన్ కళ్యాణ్ గారికి అందించాలని ప్రయత్నం చేసాం. కాని మావల్ల కాలేదు.
అందువలన ఈ అప్లికేషన్ ను మేము ప్లేస్టోర్ లో పబ్లిష్ చేస్తున్నాం. ఓక వేళ ఈ జనసేన జాగృతం అప్లికేషన్ పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగకరంగా తలిస్తే మేము ఈ అప్లికేషన్ యొక్క సర్వ హక్కులు పవన్ గారికి వెంటనే అందజేస్తాము
.
ఈ అప్లికేషన్ సమాజానికి చాలా ఉపయోగకరం అని మేము విశ్యసిస్తున్నాము.
ఈ అప్లికేషన్ యూసర్స్ తమ ఇంఫర్మేషన్ ను పోస్ట్ చేసే విధంగా డిసైన్ చేయబడింది. ఈ ఇంఫర్మేషన్ ని మేము 5 విధాలు గా విభజించాము.
1. Issue(సమస్య)
2. Novel Idea (ఆలోచన)
3. Facts(సమాచారం)
4. Ruler(నాయకులు)
5. Requital(కృతజ్ఞత)
Issue(సమస్య)
ఇందులో మీరుకాని మీ సన్నిహితులు కాని, మీకు తెలిసిన వారు కాని సామాజికంగా ఎదుర్కుంటున్న సమస్యలను పొందుపరుచవచ్చు. దీని వలన ఆ సమస్య ను చదివిన వారు తమ యొక్క సలహా కాని సహాయం కాని అందజేస్తారు.
ఆ ప్రాంతం లో ఉన్న మన జనసేన సోదరులు ఆ సమస్య కు వ్యతిరేకంగా పోరాడడానికి అవకాశం ఉంటుంది.
ఇది బహిరంగంగా చూపబడుతుంది కావున సమస్యకు కారణం అయిన వారు తప్పక భయపడతారు.
Novel Idea (ఆలోచన)
సమాజానికి అభివృద్ధి, శ్రేయస్సు పెంపొందించే ఆలోచనలు మీలో ఉన్నాయా??? ఆయితే ఇక్కడ ఆ ఆలోచనలను పొందుపరచండి. ఒక ఆలోచన బీజమై ఒక మహా వృక్షంగా మారాలంటే దానికి తగిన సహాయ సహాకారాలు ఉండాలి. అవి మీకు ఇక్కడ లభిస్తాయని ఆశిస్తున్నము
Facts(సమాచారం)
ఇక్కడ సమాజాన్ని చైతన్య పరిచే సమాచారం కానీ విజ్ణానం పెంపొందించే సమాచారం కానీ మన పవణ్ కళ్యాణ్ గారి రాజకీయ కార్యాచరణ కానీ స్వచ్చంద సేవల సమచారం కానీ పొందుపరచవచ్చు.
Ruler(నాయకులు)
మీరు మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రావాలని మరియు ఆయనకి సహాయ సహాకారాలు అందించాలని కోరుకుంటున్నారా??? అయితే మీ లక్ష్యం, విద్య, ఉద్యోగ మరియు ఇతర వివరాలను ఇక్కడ పొందుపరచవచ్చు.
దీని వలన మన జనసేన కుటుంబం ఎంత పెద్దదో ఇట్టే తెలుస్తుంది
Requital(కృతజ్ఞత)
మీరు ఏదైన క్లిష్టమైన పరిస్ధితి ఎదుర్కున్నప్పుడు మీకు ఎవరైనా సహాయపడ్దారా??? అయితే ఆ వ్యక్తి గురించి ఆ పరిస్థితి గురించి ఇక్కడ సవివరంగా చెప్పండి.
దీని వలన మీకు సహాయపడ్ద వ్యక్తి కి మీ విధేయత చూపవచ్చు అంతేగాక, మీరు ఎదుర్కున్న పరిస్థితి మరొకరు ఎదుర్కున్నట్లైతే వారికి ఏవిధంగా సహాయపడాలో ప్రజలకు తెలుస్తుంది
ఇలా పొందుపరచబడిన సమాచారం పై యూసర్స్ తమ అభిప్రాయాన్ని క్రిటికల్, లైక్స్, డిస్ లైక్స్, బగ్స్ మరియు కమెంట్స్ ద్వారా తెలియజేయవచ్చు.
ఈ అప్లికేషన్ లో మికు ఏవిధమైన మార్పులు చేర్పులు కావాలన్న మీరు మాకు "Write To Us" ఆప్షన్ ద్వారా తెలియజేయవచ్చు